ఆలయంపై కలశం చోరీ
నెల్లూరు రూరల్ : నెల్లూరు రూరల్ పరిధిలోని అల్లీపురంలో శ్రీవీరాంజనేయ స్వామి ఆలయం గర్భగుడిపై ఉన్న బంగారు తాపడం కలశాన్ని గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి అపహరించారు. నెల్లూరు రూరల్ పోలీసుల కథనం మేరకు.. అల్లీపురంలోని శ్రీవీరాంజనేయ స్వామి ఆలయంలో పూజారి శుక్రవారం రాత్రి 9.30 గంటలకు పూజలు చేసి తాళం వెళ్లారు. శనివారం ఉదయం పూజారి ఆలయానికి రాగా గర్భగుడిపై ఉన్న కలశం చోరీకి గురైనట్లు గుర్తించి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకుమార్‌రెడ్డికి సమాచారం అందించారు. ఆలయ కమిటీ సభ్యులు కలశం అపహరణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు రూరల్ ఎస్‌ఐ సుబ్బారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆలయ చైర్మన్ మాట్లాడుతూ రెండేళ్ల కిందట ఆలయం పునర్నిర్మాణం, జీర్ణోద్ధరణ జరిగిందన్నారు. గర్భగుడిపై చోరీకి గురైన 12 కేజీల పంచలోహ కలశానికి భక్తులు సమర్చించిన 90 గ్రాముల బంగారుతో తాపడం చేయడం జరిగిందన్నారు. దీని విలువ సుమారు. 3.20 లక్షలు ఉంటుందన్నారు.