చోరీలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్
Published Thu, Jan 26 2017 12:39 AM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM
జంగారెడ్డిగూడెం : చోరీలకు పాల్పడిన ఓ వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేసినట్టు ఎస్సై ఎం.కేశవరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కొయ్యలగూడెం మండలం సీతంపేటకు చెందిన షేక్ అబ్దుల్లా అలియాస్ వహాబ్ అబ్దుల్లా ప్రస్తుతం జంగారెడ్డిగూడెంలో నివసిస్తున్నాడు. అతను ఇటీవల పట్టణంలో చోరీ చేసిన మూడు ఆటో టైర్లు, ఒక ఎక్సైడ్ బ్యాటరీ, ఒక టీవీ, సెటాప్‌బాక్సు, గ్యాస్ సిలిండర్ తీసుకుని రాజమండ్రిలో అమ్ముకునేందుకు వెళ్తుండగా, విశ్వసనీయ సమాచారం మేరకు బైపాస్ రోడ్డు జంక్షన్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై టి.నరసాపురం, తడికలపూడి, తెలంగాణలోని అశ్వారావుపేట, దమ్మపేట పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి.
దమ్మపేటలో ఓ హత్యకేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇతనిపై వారెంట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. అతని వద్ద చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్టు ఎస్సై తెలిపారు.
Advertisement
Advertisement