ఆభరణాల కోసం ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిని దుండగులు చంపేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొమ్మరవేని రాయమల్లమ్మ(65) కొన్నేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి, ఒంటరిగా ఉంటోంది. బుధవారం రాత్రి తన ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆమెను గుర్తు తెలియని దుండగులు గొంతునులిమి చంపారు. ఆమె ఒంటిపైని ఆభరణాలను ఎత్తుకుపోయారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చోరీ సొత్తు వివరాలు తెలియాల్సి ఉంది.
నగల కోసం వృద్ధురాలిని చంపిన దొంగలు
Published Thu, May 26 2016 8:23 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
Advertisement
Advertisement