‘ఔటర్’పై మూడో ప్రమాదం
లారీని ఢీకొన్న మరో లారీ
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
మేడ్చల్: మండల పరిధిలోని సుతారిగూడ టోల్‌ప్లాజా సమీపంలో వరుసగా మూడో రోజు మరో ప్రమాదం చోటు చేసుకుంది. రింగురోడ్డుపై భద్రతా సౌకర్యాలు లేక మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఎనిమిది మంది మృతి చెందిన సంఘటన విదితమే. కాగా, బుధవారం ఉదయం నుంచి కురిసిన వర్షం కారణంగా రింగురోడ్డుపై నీరు నిల్వడంతో మధ్యాహ్నం శంషాబాద్ నుంచి వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడిన విషయం తెలిసిందే. అయితే, అదేరోజు రాత్రి మరో ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి శంషాబాద్ నుంచి వస్తున్న లారీ టోల్‌ప్లాజా సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వేగనిరోధకాలకు రేడియం లైటింగ్ లేకపోవడంతో లారీ డ్రైవర్‌కు స్పీడ్‌బ్రేకర్‌లు కనిపించలేదు. దీంతో ముందు వెళ్తున్న మరో లారీని ఢీకొట్టింది. రెండు లారీలు నెమ్మదిగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాదానికి గురైన లారీ ముందు భాగం ధ్వంసమైంది.