
ధనుపురంలో రోదిస్తున్న మృతిని కుటుంబ సభ్యులు
గొల్లూరు పంచాయతీ సొంటినూరు గ్రామానికి చెందిన జెన్ని నారాయణరావు(29) పిడుగు పాటుకు గురై బుధవారం మృతి చెందాడు. తన పొలంలో వ్యవసాయ పనుల్లో ఉంటూ కలుపు తీస్తుండగా ఆకస్మాత్తుగా పిడుగు పడడంతో నారాయణరావు మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య రోజా, కుమారుడు కుమారస్వామి, తల్లి అప్పలమ్మ ఉన్నారు. ఇంటి పెద్ద మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందగా...వేరే ప్రాంతానికి చెందిన గుర్తు తెలియని మరో వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు కింద పడి బుధవారం మృతి చెందాడు. నందిగాం మండలం సొంటినూరు గ్రామానికి చెందిన నారాయణరావు పిడుగుపాటుకు గురై మృతి చెందగా...హిరమండలం మండలం ధనుపురం గ్రామానికి చెందిన కార్తీక్ విజయనగరం జిల్లా గరివిడి సమీపంలో జరిగిన ప్రమాదంలో రైలు కింద పడి మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఇచ్ఛాపురం రైల్వేస్టేçÙన్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి దిగే ప్రయత్నంలో మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే...
సొంటినూరు (నందిగాం) : గొల్లూరు పంచాయతీ సొంటినూరు గ్రామానికి చెందిన జెన్ని నారాయణరావు(29) పిడుగు పాటుకు గురై బుధవారం మృతి చెందాడు. తన పొలంలో వ్యవసాయ పనుల్లో ఉంటూ కలుపు తీస్తుండగా ఆకస్మాత్తుగా పిడుగు పడడంతో నారాయణరావు మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య రోజా, కుమారుడు కుమారస్వామి, తల్లి అప్పలమ్మ ఉన్నారు. ఇంటి పెద్ద మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ కుటుంబానికి ఇక దిక్కెవరంటూ రోదించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్‌ఐ వి.నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నారాయణరావు మృతితో గ్రామంలో విషాదం అలముకుంది.
రైలు నుంచి జారిపడి యువకుడు...
హిరమండలం : మండలంలోని ధనుపురం గ్రామానికి చెందిన దువ్వరి కార్తీక్(21) విజయనగరం జిల్లా గరివిడి సమీపంలో రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మంగళవారం రాత్రి మృతి చెందాడు. కార్తీక్ కాకినాడలో జరుగుతున్న ఆర్మీ ఉద్యోగ ఎంపిక ర్యాలీ కోసం మంగళవారం రాత్రి శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేçÙన్‌లో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు. రైలు గరివిడి సమీపంలోకి వచ్చేసరికి జారిపడి మృతి చెందాడు. రక్షణ శాఖలో ఉద్యోగం పొంది దేశానికి సేవలందిస్తానని చెప్పి వెళ్లిన కుమారుడు ఇలా మృతి చెందడంతో తల్లిదండ్రులు రమేష్, సంతోషితో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కార్తీక్ మృతితో ధనుపురంలో విషాదచాయలు అలముకొన్నాయి.
గుర్తు తెలియని వ్యక్తి...
ఇచ్ఛాపురం : స్థానిక రైల్వేస్టేçÙన్‌లో రెండో నంబరు ఫ్లాట్‌ఫారం నుంచి తిరుచిరపల్లి–హౌరా సూపర్‌ఫాస్ట్ రైలు నెమ్మదిగా ప్రయాణించే సమయంలో దిగేందుకు ప్రయత్నించి ఓ యువకుడు ప్రమాదవశాత్తు దాని కింద పడి బుధవారం మృతి చెందాడు. ఈ వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు. శరీరం ముక్కలైంది. జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.