జిల్లాలో మరో మూడు అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని ఆ శాఖ అడిషనల్ డైరెక్టర్ పీవీ రమణ...
మరో మూడు అగ్నిమాపక కేంద్రాలు
Sep 17 2017 12:53 AM | Updated on Sep 13 2018 5:11 PM
ఏలూరు అర్బన్ : జిల్లాలో మరో మూడు అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని ఆ శాఖ అడిషనల్ డైరెక్టర్ పీవీ రమణ తెలిపారు. స్థానిక ఫైర్‌స్టేషన్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కుక్కునూ రు, పోలవరం, కొవ్వూరులో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటుచేయనున్నామన్నారు. జిల్లాలోని అగ్నిమాపక శాఖలో 271 శాంక్షన్ పోస్టులు ఉండగా 197 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని, 74 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. సిబ్బందితో పాటు ఆధునిక యంత్ర సామగ్రి కొరత ఉద్యోగుల పనితీరుపై ప్రభావం చూపుతోందన్నారు. ఉద్యోగుల పనితీరు మరింత మెరుగుపరిచేందుకు బ్యాచ్‌ల వారీగా కమాండో తరహా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు గోవాలో ఇప్పిస్తున్నామని చెప్పారు.
జిల్లాలో 108 భవనాలకు నోటీసులిచ్చాం
జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 108 భవనా లను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు ఇచ్చామని ఆయన చెప్పారు. వాటిలో 38 భవన యజమానులపై ప్రాసిక్యూషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. డీఎఫ్‌వో ఏవీ శంకరరావు, ఏడీఎఫ్‌వో వై.హనుమంతరావు, ఏలూరు ఫైర్ ఆఫీసర్ వీవీ రామకృష్ణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement