సివిల్ కేసులను సత్వరమే పరిష్కరించాలి
సివిల్ కేసులను సత్వరమే పరిష్కరించాలి
Published Sat, Oct 1 2016 10:37 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ రూరల్: జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో వున్న సివిల్ వివాదాల పరిష్కారానికి న్యాయమూర్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి బి.శివశంకర్‌రావు అన్నారు. శనివారం నల్లగొండలోని కోర్టు భవనాల సముదాయంలో సివిల్ చట్టాలపై జరిగిన సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయస్థానాలు కృషి చేయాలన్నారు. కక్షిదారుకు ధనం, సమయం వృథా కాకుండా, సకాలంలో న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందన్నారు. ఏళ్లుగా పెండింగ్‌లో వున్న కేసుల వివరాలను పరిశీలించి, పెండింగ్ కేసులను పరిష్కరించాలన్నారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సీతాపతి మాట్లాడుతూ సివిల్ వివాదాల పరిష్కారంలో ఎదురవుతున్న సమస్యలను, వాటి అధిగమించే పద్ధతులను వివరించారు. అంతకుముందు ఆయనకు జిల్లా జడ్జి డాక్టర్ జి.రాధారాణి, కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, న్యాయమూర్తులు ఐ.శైలజాదేవి, ఊట్కూరు సత్యనారాయణ, ఆర్డీఓ వెంకటాచారి, డీఎస్పీ సుధాకర్‌లు స్వాగతం పలికారు. అదే విధంగా స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కల్లూరి యాదయ్య, కొండ శ్రీనివాస్, అసోసియేషన్ ప్రతినిధులు నూకల నర్సింహరెడ్డి, ఎం.లెనిన్‌బాబు, నిమ్మల భీమార్జున్‌రెడ్డి, ఎస్‌పి. ప్రవీణ్‌కుమార్, కె.అనంతరెడ్డి, ఎం.ప్రమీలు, కోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మారెడ్డి, అజహారుద్దీన్, నరేందర్, నర్సింహారెడ్డి, రవికుమార్, జంగయ్య, శ్రీనివాస్ స్వాగతం పలికారు.
Advertisement
Advertisement