– పకడ్బందీగా పరీక్ష నిర్వహించండి
– అధికారులకు డీఆర్‌ఓ ఆదేశం
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) గ్రూప్–3 మెయిన్స్ పరీక్షలు ఆది, సోమవారాల్లో జరుగుతున్నాయని డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి అన్నారు. ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్ష నిర్వహణ పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. పరీక్ష నిర్వహణఫై శనివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ పరీక్షలకు 2,634 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. ఆదివారం 12 కేంద్రాల్లో జరిగే పరీక్షకు 1,735 అభ్యర్థులు, సోమవారం ఆరు కేంద్రాల్లో జరిగే పరీక్షకు 899 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు.
పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందన్నారు. పరీక్ష నిర్వహణకు 12 మంది లైజన్ అధికారులను నియమించామన్నారు. పరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నందున అభ్యర్థులు హాల్‌టికెట్‌తో మాత్రమే హాజరు కావాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ ద్వారా ఉదయం పరీక్షకు 8 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం పరీక్షకు 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్స్ తీసుకురాకూడదన్నారు. రైల్వేస్టేషన్, బస్టాండ్ నుంచి పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకునేలా రవాణా సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించిందన్నారు. లైజన్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
నేడు,రేపు గ్రూపు 3 మెయిన్స్ పరీక్ష
Published Sat, Aug 5 2017 9:21 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement