నల్లగొండ అగ్రికల్చర్ : కాపుగల్లు సొసైటీ రద్దుతో డీసీసీబీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై బ్యాంకు సీఈఓ మంగళవారం జిల్లా సహకార అధికారికి నివేదికను సమరించనున్నట్లు సమాచారం. అవసపరమైన సలహాలను తీసుకోవడం, సొసైటీ రద్దు, పాలకమండలి సమావేశం, తాత్కాలిక చై ర్మన్ నియామకం, అనంతరం చైర్మన్ ఎన్నిక తదితర అం శాలపై సలహాల కోసం పూర్తి నివేదికను అందించనున్న ట్లు తెలుస్తోంది. బ్యాంకు అధికారి అందించిన నివేదికను డీసీఓ రాష్ట్ర సహకార రిజిస్ట్రార్‌కు పంపనున్నారు. రాష్ట్ర రిజిస్ట్రార్ ఇచ్చిన సూచనల మేరకు జిల్లా సహకార అధికారి వారంలోపు బ్యాంకు పాలకమండలి అత్యవసర స మావేశాన్ని ఏర్పాటు చేసే అవకా«శం ఉంటుంది. ఈ సమావేశంలోనే తాత్కాలిక చైర్మన్‌గా సీనియర్ డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తికి బాధ్యతలను అప్పగిస్తారు. నూ తన చైర్మన్ ఎన్నికకు సంబంధించిన షె డ్యూల్‌నూ ప్రకటించే అవకాశం ఉంటుందని సహకార శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.
మూడోసారి ఎన్నిక తప్పదా..
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌కు మూడోసారి ఎన్నిక తప్పని పరిస్థితి కనబడుతోంది. రద్దయిన సొసైటీ చైర్మనే డీసీసీబీ చైర్మన్‌గా వ్యవహరిస్తుండడంతో ఆయన చైర్మన్‌గా అనర్హత పొందే అవకాశం ఉంటుందని సహకార శాఖ అధికారులు పే ర్కొంటున్నారు. మొదట ఫిబ్రవరి 2013న యడవెల్లి విజ యేందర్‌రెడ్డి డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అనంత రం ఎన్నికల ముందు తమ మధ్య ఉన్న ఒప్పందం ప్రకా రం తనకు చైర్మన్‌గా అవకాశం కల్పించాలని వైస్‌చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ముత్తవరపు పాండురంగారావు కోరండంతో యడవెల్లి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో తిరిగి రెండోసారి చైర్మన్ పదవికి ఎన్నికలను నిర్వహించా రు. సెప్టెంబర్ 2014 ఎన్నికల్లో చైర్మన్‌గా ముత్తవరపు పాండురంగారావు పిల్లలమర్రి శ్రీనివాస్‌పై గెలుపొందారు. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలతో తిరిగి చైర్మన్ పదవికి మూడోసారి ఎన్నికలు తప్పని పరిస్థితి కనబడుతుంది.
నేడు డీసీఓకు డీసీసీబీ వ్యవహారం
Published Tue, Dec 13 2016 2:32 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement