చాపాడు: మండలంలోని పల్లవోలు వద్దగల శ్రీ చైతన్యభారతి, విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కాలేజీల్లో శనివారం నుంచి మూడు రోజుల పాటు జిల్లా స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు సీబీఐటీ, వీబీఐటీ కరస్పాండెంట్ వి.జయచంద్రారెడ్డి తెలిపారు. క్రీడలను ఉదయం 9.30 గంటలకు డీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, షటిల్, లాంగ్ జంప్, షాట్‌పుట్, డిస్కస్ త్రో విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.