నేడు ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్‌ | today sc and st grevance | Sakshi
Sakshi News home page

నేడు ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్‌

Published Sun, Jan 29 2017 11:23 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

today sc and st grevance

అనంతపురం అర్బన్‌ : కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఆధ్వర్యంలో సోమవారం మీ కోసం కార్యక్రమంతో పాటు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్‌ జరుగుతుందని మీ కోసం ఇన్‌చార్జ్‌ అనుపమ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటలకు గ్రీవెన్స్‌ ప్రారంభమవుతుందన్నారు.

దళిత, గిరిజన సంఘాల ప్రతినిధులు, ప్రజలు హాజరై తమ సమస్యలను అర్జీ రూపంలో కలెక్టర్‌కి సమర్పించుకుని పరిష్కారం పొందాలని తెలియజేశారు. అధికారులు తప్పని సరిగా ఉదయం 9.30 గంటలకు రెవెన్యూ భవన్‌లో హాజరవ్వాలని కలెక్టర్‌ ఆదేశించినట్లు ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement