కేసీఆర్ ఆరోసారి
నేడు జిల్లాకు ముఖ్యమంత్రి
గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి ప్రారంభం
మేడిపల్లి - రాంపూర్‌లో బహిరంగసభ
ఒక్క రోజు పర్యటనే!
వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి జిల్లాకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోనే ప్రారంభించనున్నారు. పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలం గంగదేవిపల్లిలో సోమవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా గంగదేవిపల్లికి హెలికాప్టర్‌లో రానున్నారు. గ్రామంలో గ్రామజ్యోతి ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. అనంతరం నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం మేడిపల్లి-రాంపూర్‌లోనూ గ్రామజ్యోతి సభలో పాల్గొంటారు. అక్కడి నుంచే నేరుగా హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీసులు బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గత ఏడా ది జూన్ 2న ముఖ్యమం త్రి పదవి చేపట్టిన కేసీఆర్... ఇప్ప టి వరకు ఐదుసార్లు జిల్లాకు వచ్చారు. జూలైలో హరితహారం కార్యక్రమానికి రావా ల్సి ఉన్నా.. ఆఖరి నిమిషంలో పర్యటన రద్దరుుంది. ఇప్పుడు గ్రామజ్యోతి కార్యక్రమం కోసం జిల్లాకు వస్తున్నారు.
ఒక్క రోజు పర్యటనే...
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన మొదట రెండు రోజులు ఉంటుందనే నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. సోమవారం పరకాల, నర్సంపేట నియోజకవర్గాల్లో... మంగళవారం వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో పర్యటించేలా పర్యటన మొదట ఖరారైంది. చివరి నిమిషయంలో రెండో రోజు పర్యటన రద్దరుు్యంది. గ్రామజ్యోతికి ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతోనే కేవలం ఈ కార్యక్రమానికే పరిమితమైనట్లు టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు చెబుతున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కేసీఆర్ నగర పర్యటన రద్దవడంతో మోడల్ మార్కెట్, షాదీఖానా నిర్మాణానికి శంకుస్థాపనలు వాయిదా వేయాల్సి వచ్చింది. ఏళ్లుగా ప్రారంభానికి నోచుకోకుంటా ఉన్న రీజిన్ సైన్స్ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు ప్రారంభించనున్నారని భావించినా చివరిని నిమిషయంలో మళ్లీ రద్దయ్యింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం వడ్డెపల్లి చెరువు ట్యాంక్‌బండ్ పరిశీలన పరిస్థితి ఇలాగే ఉంది.
సీఎం పర్యటన ఇలా..
ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్‌లో గీసుగొండ మండలం గంగదేవిపల్లికి చేరుకుంటారు. ఒంటి గంట వరకు గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు మేడిపల్లిలో భోజనం మధ్యాహ్నం రెండు గంటల నుంచి 3 గంటల వరకు మేడిపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమం పాల్గొంటారు.మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగు పయనం.