రేపు ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నా | Tomorrow dharna infront of rtc dipos | Sakshi
Sakshi News home page

రేపు ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నా

Published Tue, Oct 18 2016 12:18 AM | Last Updated on Tue, May 29 2018 6:37 PM

Tomorrow dharna infront of rtc dipos

కడప అర్బన్‌ :  వైఎస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన కార్మికుల సమస్యలపై రీజినల్‌ వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు యూనియన్‌ రీజినల్‌ కార్యదర్శి ఎస్‌బీ ఫకృద్దీన్‌ తెలిపారు. ఈనెల 7వ తేదీన రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమావేశం నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి టీఎస్‌ఎస్‌ ప్రసాద్, రీజినల్‌ గౌరవాధ్యక్షులు కె.సురేష్‌బాబు హాజరయ్యారన్నారు. ఈనెల 19వ తేదీన ఆందోళనలు చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ధర్నాల్లో పాల్గొనాలన్నారు. అలాగే 26న ఛలో ఆర్‌ఎం కార్యాలయం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement