‘జన హృదయ నేత’కు పిండ ప్రదానం
సత్రశాల (రెంటచింతల): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి సత్రశాలలో ఆదివారం వైఎస్సార్‌సీపీ మండల ఉపాధ్యక్షుడు ఏరువ శౌరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వైఎస్ అభిమానులు పుష్కరస్నానం చేయించారు. ఈ సందర్భంగా శౌరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచకపాలనకు వైఎస్ ఆత్మ క్షోభిస్తుందని, పుష్కరస్నానంతో ఆయన ఆత్మకు నిత్యవిశ్రాంతి కలుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బొంకూరి తిరుపతిరావు, పూసపాటి లక్ష్మయ్య, దుగ్గింపూడి చిన్నపరెడ్డి, ఏరువ రాజారత్నారెడ్డి, కుందురు వినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.