రైలు కిందపడి వ్యక్తి మృతి
Published Tue, Sep 20 2016 9:57 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
పాలకొల్లు సెంట్రల్ : పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎసై ్స జి ప్రభాకర్రావు తెలిపారు. మంగళవారం ఉదయం గుంటూరు పాస్ట్ ప్యాసింజర్ వెళ్లే సమయంలో జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారన్నారు. సుమారు 33 సంవత్సరాలు వయస్సు కలిగి ఉంటాడన్నారు. రైల్వే క్రాసింగ్ గేటు నుండి నరసాపురం వెళ్లే వైపు ఈ సంఘటన జరిగిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై ్స తెలిపారు.
Advertisement
Advertisement