విపత్తులపై ముందు జాగ్రత్తలు అవసరం
-
ఫిషరీస్ జేడీ కె.సీతారామరాజు
నెల్లూరు(దర్గామిట్ట): విపత్తులు, ప్రకృతి వైపరిత్యాల సమయంలో తీరప్రాంత ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఫిషరీస్ జాయింట్ డైరక్టర్ కె.సీతారామరాజు అన్నారు. మంగళవారం నగరంలోని డీఆర్ ఉత్తమ హోటల్‌లో జరిగిన శిక్షణ తరగతుల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు లైఫ్ జాకెట్ వాడాలన్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్14 వరకు సముద్రంలో చేపల వేట నిషేధమని ఆ సమయంలో వారి జీవనోపాధికి ఇది వరకు బియ్యం, నిత్యావసరాలు ఇచ్చేదని, ప్రస్తుతం వాటి బదులు రూ.2 నుంచి రూ.4 వేల జీవన భృతి పెంచిందన్నారు.
తీరప్రాంత వాసులకు శిక్షణ
చైతన్యజ్యోతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నుంచి విపత్తుల నిర్వహణపై సూచనలు, సలహాలు గురించి సేవ్ ద చిల్డ్రన్ జాతీయ స్థాయి మేనేజర్ కంచర్ల రామప్ప(కంచర్లరే) శిక్షణ ఇచ్చారు. చైతన్నజ్యోతి అధ్యక్షుడు ఐ.శ్రీనివాసరావు మాట్లాడతూ 7 తీరప్రాంత మండలాల నుంచి 80 మందికి పైగా ప్రతినిధు లు హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో ఢిల్లీ కన్సల్‌టెంట్ రమిత్‌బసు,డిఎస్‌పి కె.శ్రీనివాసాచారి పాల్గొన్నారు.