బాధితులను పరామర్శించనున్న వైఎస్ జగన్
నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బాణసంచా ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. మంగళవారం నెల్లూరుకు వెళ్లనున్న వైఎస్ జగన్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు సోమవారం వెల్లడించాయి.
నెల్లూరు నగర శివార్లలోని పొర్లుకట్ట సమీపంలో ఉన్న ఓ ఇంట్లో బాణసంచా పదార్థాల వల్ల భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో ఐదుగురు మృతిచెందగా.. 12 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.