వడదెబ్బతో పన్నెండు మంది మృతి | twelve members die with sun stroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో పన్నెండు మంది మృతి

Published Wed, Apr 13 2016 4:14 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM

twelve members die with sun stroke

సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలో మండుతున్న ఎండలతో వడదెబ్బ తగిలి మంగళవారం పన్నెండు మంది బల య్యారు. మృతుల్లో మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన మన్నె సాయిలు(65), కౌడిపల్లి మండ లం కూకుట్లపల్లికి చెందిన వడ్లరాజు(26), రామాయంపేట పట్టణానికి చెందిన సింధుమోచ మల్లయ్య(60),  నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం గిర్నితండాకు చెందిన ఉపాధికూలీ కడావత్ బన్సీ (53), రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని రామన్నగూడ గ్రామానికి చెంది న రైతు తుప్పరి నర్సింహారెడ్డి(68), తాండూరు మండలం కొత్లాపూర్‌లో కర్ణాటకకు చెందిన మసప్ప (60) ఉన్నారు. 

నల్లగొండ జిల్లా భువనగిరి మండ లం బండసోమారం గ్రామానికి చెందిన కూనూరు రేణుక (26), ఆత్మకూర్ (ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన మల్లేష్ (22) మృతిచెం దారు.  ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం బాలేపల్లి గ్రామానికి చెందిన దుర్గం మురళీధర్ (47) మర ణించాడు. ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెం దిన తడికమళ్ల మరియమ్మ (60), కామేపల్లి  మండల కేంద్రానికి చెందిన మేదర సౌజన్య(18), చర్ల మండల పరిధిలోని  ఆర్ కొత్తగూడేనికి చెందిన కోండ్రు నర్సయ్య (70) మంగళవారం వడదెబ్బతో మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement