కర్నూలు: జిల్లాలోని నంద్యాలలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. సెయింట్ జోసఫ్ పాఠశాలకు చెందిన వసుంధర, సురేఖలు స్కూలుకు వెళ్లిన తరువాత తిరిగి ఇంటికి రాలేదు.
దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్థానిక పీఎస్ లో బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.