- ఏడుగురికి గాయాలు
- గ్రామంలో బందోబస్తు ఏర్పాటు
పుట్టపర్తి అర్బన్ : మండలంలోని చెర్లోపల్లిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. భూ వివాదం నేపథ్యంలో తగాదా జరిగి ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు పుట్టపర్తి రూరల్ ఎస్‌ఐ రాఘవరెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి 9.30 గంటలకు రెండు వర్గాల వారు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నట్లు వివరించారు. గురువారం ఉదయమే రెండు వర్గాల వారిచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
గ్రామానికి చెందిన హరికృష్ణ, దేవా, నరసింహుడు, లక్ష్మీదేవి, కుమారి తమ ప్రత్యర్థి వర్గానికి చెందిన భాస్కర్, వనజ, విజయ్‌పై రాళ్లు, కర్రలతో దాడి చేసి గాయపరచినట్లు ఎస్‌ఐ తెలిపారు. భాస్కర్, విజయ్, ఆదినారాయణ కలసి హరికృష్ణ, కుమారి, నరసింహులు, లక్ష్మీదేవిపై రాళ్లు, కర్రలతో గాయపరిచినట్లు పేర్కొన్నారు. గాయపడ్డ వారిని ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్‌ఐ తెలిపారు.
చెర్లోపల్లిలో రెండు వర్గాల ఘర్షణ
Published Thu, Mar 30 2017 11:41 PM | Last Updated on Sat, Aug 25 2018 5:38 PM
Advertisement
Advertisement