ఒకే స్పాట్లో రెండు షాకింగ్ ఇన్సిడెంట్లు
ఒకే స్పాట్లో రెండు షాకింగ్ ఇన్సిడెంట్లు
Published Wed, Mar 16 2016 10:11 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
ఒకటే స్పాట్ లో రెండు షాకింగ్ ఇన్సిడెంట్లు.. క్షణాల తేడాతో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. త్వరగా వెళ్లాలనే తాపత్రయం ఒక ప్రమాదానికి కారణమైతే..రోడ్డుమీద వున్న రాయి మరో ప్రమాదానికి దారి తీసింది... ప్రమాదానికి గురైన ఇద్దరూ మహిళలే...అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ రెండు సంఘటనలు కరీంనగర్‌లో జరిగాయి. కోర్టు వైపు నుంచి శివథియేటర్ వైపు వెళ్తున్న టిప్పర్‌ను వెనుక నుంచి వచ్చిన బైకిస్టు ఓవర్‌టేక్ చేయాలని వేగం పెంచి దాటే ప్రయత్నం చేశాడు. ఒక్క సారి కుదుపు రావడంతో బైక్ వెనుక కూర్చున్న అమ్మాయి అదుపుతప్పి కిందపడిపోయింది. వెంటనే అప్రమత్తమైన టిప్పర్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసినా...టిప్పర్ దాదాపు అమ్మాయి మీదకు వెళ్లి ఆగింది. అయితే అదృష్టం బాగుండి ప్రాణాలు నిలిచాయి. కానీ తీవ్రగాయాలు కావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. ప్రమాదం గురైన అమ్మాయి తెలిపిన వివరాల ప్రకారం పరీక్షల హాల్ టిక్కెట్ మరచిపోవడంతో ఇంటికి వెళ్లి తీసుకుని, ఎగ్జామ్ టైం అవుతుందని వేగంగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది.
అదే ప్రాంతంలో క్షణాల తేడాతో మరో ఘటన జరిగింది.. ఒక వైపు టిప్పర్ ఘటన జరిగినప్పుడే కుడివైపున మరో ప్రమాదం జరిగింది. శివ థియేటర్ వైపు నుంచి కోర్టు వైపు వెళ్తున్న ఒక బైక్...రోడ్డు పక్కన ఉన్న రాయిపై ఎక్కడంతో కంట్రోల్ తప్పింది. దీంతో వెనుక కూర్చున్న మానస అనే మహిళ ఒక్కసారిగా వెల్లకిలా పడిపోయింది. అదృష్టం కొద్దీ వెనుక వాహనాలు ఏవీ లేకపోవడంతో ప్రాణాలతో బయటపడింది. క్షణాల తేడాతో జరిగిన ఈ రెండు ప్రమాద దృశ్యాలు సమీపంలో వున్న ఓ కంప్యూటర్ షాపులో అమర్చిన సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి.
అయితే ఈ రెండు ప్రమాద ఘటనలు ఎప్పుడు జరిగాయో తెలియరాలేదు.
Advertisement
Advertisement