'40ఏళ్ల జీవోను మా ముఖాన కొట్టారు' | unemployees protest against cm chandra babu | Sakshi
Sakshi News home page

'40ఏళ్ల జీవోను మా ముఖాన కొట్టారు'

Published Wed, Sep 9 2015 3:05 PM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

unemployees protest against cm chandra babu

ఏలూరు (పశ్చిమగోదావరి) : నిరుద్యోగులకు కొండంత అండగా ఉంటామంటూ హామీలను ఊదరగొడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడని నిరుద్యోగులు ఆందోళన చేశారు. కేవలం వయోపరిమితికి సంబంధించి 40ఏళ్లు చేస్తూ జీవోను మా ముఖాన కొట్టి సీఎం చేతులు దులుపుకున్నారని వారు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బుధవారం ఆందోళనకు దిగి తమకు ఉద్యోగాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు.

బాబు వస్తే జాబ్ వస్తుందంటూ ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతున్నా నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిగో ఉద్యోగ ప్రకటన.. అదిగో ఉద్యోగం అంటూ ప్రకటనలకే ఏపీ ప్రభుత్వం పరిమితమైందని వారు విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement