రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గురుకుల ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమకిచ్చిన హామీలను అమలు చేయకపోగా
సర్కారు వైఖరిపై గురుకుల సిబ్బంది అసంతృప్తి
చర్చలకు పిలవకపోవడంపై సంఘాల ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గురుకుల ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమకిచ్చిన హామీలను అమలు చేయకపోగా, సమస్యలపై కనీసం చర్చించకపోవడంపై వారు గుర్రుగా ఉన్నారు. సమాన పనికి సమాన వేతన స్కేళ్లు (ప్యారిటీ స్కేళ్లు), అడ్‌హక్, కాంట్రాక్ట్ టీచర్ల క్రమబద్ధీకరణ, తదితర సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీనిచ్చి దానిని పట్టించుకోకపోవడాన్ని వారు నిలదీస్తున్నారు. తమ డిమాండ్ల సాధనకు సాంఘిక, గిరిజన సంక్షేమ, విద్యాశాఖ పరిధిలోని మూడు గురుకులాల ఉపాధ్యాయులు, ఉద్యోగులు గత నెలలో వివిధ నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. గత నెల 26న చలో హైదరాబాద్ పేరిట ‘మహాధర్నా’ను నిర్వహించారు.
అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పం దన రాకపోవడంతో సమ్మెకు సిద్ధం కావాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పందించి విద్యార్థుల త్రైమాసిక పరీక్షలున్నందున, 15 రోజులు నిరసనలను వాయిదా వేసుకోవాలని, ఈ లోగా ఆయా సమస్యలపై అధికారులు, సంఘాలతో చర్చించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ గడువు కూడా ముగి సినా ప్రభుత్వపరంగా తమతో ఎలాంటి చర్చలు జరపకపోవడాన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సం ఘాలు తప్పుబడుతున్నాయి.
స్కేళ్లను సవరించకపోగా, అందుకు విరుద్ధంగా పీఆర్‌సీ కరస్పాం డింగ్ స్కేళ్లు ఇస్తూ జీవో జారీచేయడంపై అభ్యం తరాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీమేరకు ఇంతవరకు ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించకపోవడం గురుకుల ఉపాధ్యాయవర్గాన్ని అవమానించడమేనని ఈ సంఘాలు పేర్కొన్నాయి. ఆర్థిక భారం లేని ప్యారిటీ స్కేళ్లను అమలు చేయకపోతే వర్క్‌టు రూల్ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించాయి.
ఇవీ గురుకుల సిబ్బంది సమస్యలు...
తమకు 2010 పీఆర్‌సీలో తీర ని అన్యాయం జరి గిందని సిబ్బంది వాపోతున్నారు. రోజుకు దాదాపు 18 గంటల పాటు పనిచేస్తున్నా, అదనపు పనికి అదనపు వేతనం లభించడం లేదని చెబుతున్నారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు గురుకులాల క్యాంపస్‌లోనే ఉంటూ విద్యార్థులకు డైలీటెస్ట్‌లు, స్లిప్‌టెస్ట్‌లు మొదలుకుని అసైన్‌మెంట్లు, ఫ్లాష్‌టెస్ట్‌లు నిర్వహిస్తూ ఎంతో ఒత్తిడిలో పనిచేస్తున్నా తమకు తగిన వేతనాలు అందడం లేదంటున్నారు. గతం లో జరిగిన తప్పులను సరిచేయాలని, పనికి తగ్గ వేతనం చెల్లించాలని, టీ జీటీలకు స్కేల్, పీజీటీ స్కేల్‌లకు 3 గ్రేడ్లు, గురుకుల లెక్చరర్ స్కేల్‌ను 4 గ్రేడ్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.