
పనికిరాని పంటలబీమా పథకాలు: జీవన్‌రెడ్డి
జగిత్యాల అగ్రికల్చర్: పంటల బీమా పథకాలు రైతులకు పనికిరాకుండా ఉన్నాయని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల సింగిల్‌విండో ఆధ్వర్యంలో ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంపై సోమవారం ఒక్క రోజు శిక్షణ సద స్సు జరిగింది. దీనికి హాజరైన ఆయన మాట్లాడుతూ, కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత బీమా పథకాల గురించి గ్రామీణ రైతులకు తెలియడం లేదన్నారు. పంటనష్టం జరిగినప్పుడు రైతువారీగా అంచనా వేయాలని అసెంబ్లీలో మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కంపెనీలకు, బ్యాంకులకు లాభం చేయడానికే బీమా పథకాలని ఆరోపించారు.