
ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవాలి
ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలని డ్వామా పీడీ హరిత అన్నారు. ముకునూర్ గ్రామంలో లైఫ్ ప్రాజెక్ట్ కింద ఉపాధి హామీలో పనిచేస్తున్న యువ రైతులకు ఆరు రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు.
డ్వామా పీడీ హరిత
ఇబ్రహీంపట్నం : ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలని డ్వామా పీడీ హరిత అన్నారు. ముకునూర్ గ్రామంలో లైఫ్ ప్రాజెక్ట్ కింద ఉపాధి హామీలో పనిచేస్తున్న యువ రైతులకు ఆరు రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ కేంద్రాన్ని ఆదివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమకున్న వనరులతోనే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలన్నారు. వర్మీకంపోస్టు ఎరువులను తయారు చేసుకునే పద్ధతులను నేర్చుకోవాలన్నారు. రసాయనిక ఎరువులను తగ్గించడం వలన నాణ్యమైన పంట చేతికందడంతోపాటు ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. ఆధునిక వ్యవసాయాన్ని సాగుచేసుకునే పద్ధతులను మెరుగుపరిచేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదం చేస్తుందన్నారు. అనంతరం ఆమె పొల్కంపల్లి, నాగ¯ŒSపల్లి రోడ్ల కిరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. నాటిన మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో లైఫ్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ శ్యామల, సర్పంచ్ లక్ష్మమ్మ, ఉపాధి హామీ ఏపీడీ తిరుపతయ్య, టీఏలు బాబురావు, రవి పాల్గొన్నారు.