ఫామ్‌హౌస్‌లో పడుకుంటే సమస్యలు తీరతాయా?
- కరువుపై ప్రభుత్వం తీరును ఎండగట్టిన సీపీఎం కార్యదర్శి తమ్మినేని
తెలంగాణ రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. జిల్లాలో కరువు పర్యటనలో భాగంగా ఆయన సోమవారం తిప్పర్తికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కరువు ప్రకటించిన మండలాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని అన్నారు.
కేవలం కరువుపై ప్రకటనలు చేసి.. సీఎం ఫామ్ హౌస్ లో పడుకుంటే సమస్యలు తీరుతాయా అని ప్రశ్నించారు. విపక్ష ఎమ్మెల్యేలు కాంట్రాక్టులు తీసుకుని ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ప్రతి మండలానికి కరువు సహాయం కింద రూ.10 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సీట్లు గెలవకపోయినా ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ సీపీఎం మాత్రమేనన్నారు. 23న కలెక్టరేట్ ముట్టడికి ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.