నల్లగొండ: నల్లగొండను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. జిల్లాలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నా ప్రభుత్వం స్పందించటం లేదని విమర్శించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు పాల్గొన్నారు.