బీవీ రాఘవులు (ఫైల్ ఫోటో)
నల్గొండ :కేంద్రంలో బీజేపీ పకోడీ రాజకీయాలు చేస్తోందని, పకోడీలు చేసేవారిని అవమానించే విధంగా ప్రవర్తిస్తోందని సీపీఎం సీనియర్ నేత బీవీరాఘవులు విమర్శించారు. నల్గొండలో విలేకరులతో మాట్లాడుతూ..బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీగా ఉందని వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థను బలపరుస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా తప్పులు కప్పి పుచ్చుకునే విధంగా వ్యవహరిస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏయే రంగాలలో ఉపాధి కల్పించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
విభజన చట్టాన్ని అమలు చేయడంలో బీజేపీ విఫలం అయిందని విమర్శించారు. కాంగ్రెస్ కన్నా ఎక్కువ హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. కేసీఆర్, చంద్రబాబులు కాలక్షేపం చేశారు తప్ప కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోయారని విమర్శించారు. విభజన చట్టం హామీల గురించి కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ నాలుగు సంవత్సరాల్లో కేంద్రం ప్రకటించిన హామీలపై శ్వేత పత్రం విడుదల చేసి కేంద్రంపై పోరాడాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment