
ఎస్కేయూలో వెన్నపూస గోపాల్‌రెడ్డి ప్రచారం
అనంతపురం టౌన్ : వైఎస్సార్‌సీపీ మద్దతుతో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డి సోమవారం ఎస్కేయూలో ప్రచారం చేశారు. పరిపాలన, పరీక్షల విభాగంతో పాటు ఉద్యోగులు, రీసెర్చ్ స్కాలర్ విద్యార్థులను కలిసి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రొఫెసర్ రమణారెడ్డి, నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, బాలకృష్ణారెడ్డి, చెన్నప్ప, శ్రీనివాసరెడ్డి, వైఎస్‌ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, కార్యదర్శి నరసింహారెడ్డి, వర్సిటీ అధ్యక్షుడు భానుప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.