వెర్మీరియన్ పరిశ్రమను ప్రారంభిస్తున్న మంత్రి కామినేని శ్రీనివాస్
శ్రీసిటీ(సత్యవేడు) : శ్రీసిటీలో శుక్రవారం బెల్జియం దేశానికి చెందిన వెర్మీరియన్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ పరిశ్రమను రాష్ట్రవైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఆస్పత్రి పరికరాల తయారీలో పేరుగాంచిన వెర్మీరియన్ గ్రూప్ భారతదేశంలో మొట్టమొదట ఉత్తత్తి కేంద్రాన్ని శ్రీసిటీలో ప్రారంభించింది. చెన్నైలోని బెల్జియం కాన్సుల్ జనరల్ డాక్టర్ బార్డ్ డి గ్రూఫ్, వెర్మీరియన్ గ్రూప్ సీఈవో పాట్రిక్ వెర్మీరియన్,వెర్మీరియన్ గ్రూప్ సీఎఫ్‌వో జాన్ పేన్‌హెర్క్, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఈ కంపెనీ ఉత్పత్తుల్లో ప్రధానమైనవి వీల్‌చైర్లని, ఆస్పత్రులు, దివ్యాంగులకు మాత్రమే కాకుండా వయస్సు మీరిన వారికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. వెర్మీరియన్ గ్రూప్ సీఈవో పాట్రిక్ వెర్మీరియన్ మాట్లాడుతూ రూ. 40వేల కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ ఏర్పాటు చే శామని, ప్రపంచంలో ఇది నాలుగో ఉత్పత్తి కేంద్రమని తెలిపారు. ఇండియా తమకు చాల ముఖ్యమైన వ్యాపార కేంద్రమని, ఇక్కడ తక్కువ ధరలకు ఉత్పత్తులు అందిస్తామని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో అన్ని వసతులు కలిగిన శ్రీసిటీలో తమ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ వెర్మీరియన్ కంపెనీ శ్రీసిటీలో నెలకొల్పడం తనకు చాలా ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కంపెనీ ఏర్పాటుతో తక్కువ ధరతో నాణ్యమైన వస్తువులు తమకు లభిస్తాయని విశ్వసిస్తున్నానని చెప్పారు.
07ఎస్‌టివిడి03–