మా బతుకులు అంధకారం చేయొద్దు
మా బతుకులు అంధకారం చేయొద్దు
Published Thu, Aug 25 2016 10:17 PM | Last Updated on Fri, Nov 9 2018 4:46 PM
15వ రోజుకు పశువైద్య విద్యార్థుల ధర్నా
గన్నవరం:
ఏపీపీఎస్సీ నుంచి పశువైద్యుల నియామకాలను మినహాయించాలని కోరుతూ స్థానిక ఎన్టీఆర్ పశువైద్య కళాశాల విద్యార్థులు చేపట్టిన సమ్మె గురువారం 15వ రోజుకు చేరుకుంది. కళాశాల ప్రధాన ద్వారం తలుపులు మూసివేసిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున్న నినాదాలు చేశారు. విద్యార్థులు జి. చంద్రశేఖర్‌రెడ్డి, డి. మోహన్‌వంశీ, ఎల్. ఫణికుమార్, సుమంత్, సురేంద్రలు మాట్లాడుతూ... గత 30 ఏళ్ళుగా మెరిట్ ఆధారంగా జరుగుతున్న డిపార్ట్‌మెంట్ సెలక్షన్స్‌కు విరుద్దంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరుద్యోగ పశువైద్య విద్యార్థులకు తీవ్ర నిరాశపరిచిందన్నారు. ఏపీపీఎస్సీ విధానం వల్ల ప్రతిభవంతులైన విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి పాత పద్ధతిలోనే ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు టి. హేమ, దీప్తి, వీణ, రాగిణి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement