'విజయవాడకు రాజధాని కళ వచ్చేసింది' | vijayawada look like AP capital, says Chandrababu | Sakshi
Sakshi News home page

'విజయవాడకు రాజధాని కళ వచ్చేసింది'

Published Wed, Aug 12 2015 7:33 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

'విజయవాడకు రాజధాని కళ వచ్చేసింది' - Sakshi

'విజయవాడకు రాజధాని కళ వచ్చేసింది'

విజయవాడ: ప్రజా సమస్యలను తామెప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆదాయం పెంచుకుంటూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నానని తెలిపారు. విజయవాడలో బుధవారం రాత్రి ఆయన విలేకరులో మాట్లాడారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే...

* విజయవాడకు రాజధాని కళ వచ్చేసింది
* రాజధానిని వ్యతిరేకించిన వారే ఇప్పుడు సమర్థిస్తున్నారు
* రాష్ట్రానికి సంబంధించిన చాలా సమస్యలు పరిష్కరించాల్సివుంది
* కేంద్రం వద్ద చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి
* సమస్యల పరిష్కారం కోసం 8సార్లు ప్రధానమంత్రిని కలిశా
* ఏపీ ప్రజలు కోరుకుంటే వచ్చిన విభజన కాదు
* రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించారు
* విభజన తర్వాత సమస్యల వారసత్వం ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది
* ప్రత్యేక హోదాపై ఏం జరుగుతుందో మాట్లాడాల్సిన బాధ్యత నాపై ఉంది
* జైట్లీ, వెంకయ్య, నిర్మలా సీతారామన్, అమిత్ షాతో నిన్న మాట్లాడాను
* ఈరోజు నాతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు
* ప్రధానికి నా ఆవేదన, రాష్ట్ర పరిస్థితుల గురించి వివరించాను
* ఆగస్టు 15 తర్వాత నన్ను ఢిల్లీకి పిలిచి మాట్లాడతానని ప్రధాని చెప్పారు
* ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో ఏపీకి సమాన హక్కులు ఉన్నాయి
* పదేళ్ల తర్వాతే తెలంగాణకు హైదరాబాద్ రాజధాని అవుతుంది
* ఉభయ రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కేసీఆర్ సర్కార్ సహకరించడం లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement