
కౌడిపల్లిలో బొడ్డెమ్మలు పెట్టి బతుకమ్మ ఆడుతున్న మహిళలు, పిల్లలు
కౌడిపల్లి: గ్రామాల్లో బొడ్డెమ్మల సందడి మొదలైంది. బతుకమ్మ పండుగకు ముందు చిన్న బతుకమ్మలను, అంతకు ముందు బొడ్డెమ్మల పండుగను నిర్వహించడం ఆనవాయితీ. కాగా గత శుక్రవారం నుంచి గ్రామాల్లో బొడ్డెమ్మల పండుగ సందడి నెలకొంది. మంగళవారం ఐదో రోజు కౌడిపల్లిలో బొడ్డెమ్మలను పేర్చి మహిళలు బతుకమ్మ ఆడారు. అనంతరం బొడ్డెమ్మలను చిన్నపిల్లల ఒడిలోపెట్టి పాటలు పాడుతూ ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.