స్వల్పంగా పెరిగిన ప్రవాహం
-
బ్యారేజ్ నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల
ధవళేశ్వరం :
కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతి సోమవారం సాయంత్రం స్వల్పంగా పెరిగింది. బ్యారేజ్ వద్ద నీటిమట్టం10.90 అడుగులకు చేరుకుంది. దీంతో 2,00,113 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టాలకు సంబంధించి తూర్పు డెల్టాకు 4,200 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2,200 క్యూసెక్కులు, పశ్చిమడెల్టాకు 7 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతోనే స్వల్పంగా నీటిమట్టం పెరిగిందని హెడ్‌వర్క్స్ ఈఈ కృష్ణారావు తెలిపారు. ఎగువప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 5.38 మీటర్లు, పేరూరులో 9.28 మీటర్లు, దుమ్ముగూడెంలో 8.34 మీటర్లు, భద్రాచలంలో 27.30 అడుగులు, కూనవరంలో 9.04 మీటర్లు, కుంటలో 7.05 మీటర్లు, కోయిదాలో 10.46 మీటర్లు,పోలవరంలో 7 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వేబ్రిడ్జివద్ద 13.95 మీటర్ల నీటిమట్టాలు నమోదయ్యాయి.