నీటిని కిందకు విడిచిపెడుతున్న దృశ్యం
స్వల్పంగా పెరిగిన మడ్డువలస
Published Wed, Sep 21 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు నీటిమట్టం బుధవారం స్వల్పంగా పెరిగింది. సువర్ణముఖి నదిలో నీటి ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టులోకి 7 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు వద్ద 63.80 మీటర్ల లెవెల్ నీటిమట్టం నమోదైంది. దీంతో ప్రాజెక్టు వద్ద మూడుగేట్లు ఎత్తి వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెడుతున్నట్టు డీఈ జి.పద్మజ తెలిపారు.
Advertisement
Advertisement