స్వల్పంగా పెరిగిన శ్రీశైలం డ్యాం నీటిమట్టం
స్వల్పంగా పెరిగిన శ్రీశైలం డ్యాం నీటిమట్టం
Published Wed, Aug 17 2016 12:27 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం డ్యాం నీటిమట్టం మంగళవారం స్వల్పంగా పెరిగింది. సోమవారం సాయంత్రం సమయానికి 874.90 అడుగులుగా ఉన్న నీటిమట్టం మంగళవారం సాయంత్రం సమయానికి 875.10 అడుగులకు చేరుకుంది. ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి 24వేల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 29,696 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన చేస్తూ 15,571 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 12,100 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 163.9724 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Advertisement