ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కావడంలేదని.. | Who are not married to the girl .. | Sakshi
Sakshi News home page

ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కావడంలేదని..

Published Tue, Aug 23 2016 9:42 PM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM

మృతి చెందిన రాజశేఖర్‌ - Sakshi

మృతి చెందిన రాజశేఖర్‌

అల్వాల్‌: ప్రేమించిన అమ్మాయిని కాదని మరో అమ్మాయితో పెద్దలు పెళ్లి కుదిర్చడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మధుసూధన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం....నల్లగొండ జిల్లా కోదాడ మండలం బోజన్నగూడెంకు చెందిన బానోతు రాజశేఖర్‌ (27) నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ అల్వాల్‌ రాంనగర్‌లో నివాసముంటున్నాడు.

రెండేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్న అతను ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు కులాంతర వివాహానికి అంగీకరించకపోగా, మరో యువతితో నిశ్చితార్దం చేశారు. దీంతో మనస్థాపానికి గురైన రాజశేఖర్‌ మంగళవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement