ఎడ్లపోటీల విజేత ‘తూర్పు’
తిరుమాలి(ఏలేశ్వరం) :
శ్రీనేరేళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా శుక్రవారం తిరుమాలిలో జరిగిన రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పరుగుపోటీల రెండు విభాగాల్లో తూర్పు గోదావరి ఎడ్లు ప్రథమస్థానంలో నిలిచాయి. తూర్పు, పశ్చిమ, కృష్ణా, విశాఖ జిల్లాల నుంచి సీనియర్ విభాగంలో 5 జట్లు, జూనియర్ విభాగంలో 21 జట్లు పాల్గొన్నాయి. సీనియర్‌విభాగంలో తూర్పుగోదావరి జిల్లా ఆర్‌బీకొత్తూరుకు చెందిన చుండ్రు సత్యనారాయణ ఎడ్లు ప్రథమస్థానం, విశాఖ జిల్లా చోడవరానికి చెందిన ఎం.రామకృష్ణ ఎడ్లు ద్వితీయస్థానం, సామర్లకోటకు చెందిన వల్లూరి సత్యదేవరకు చెందిన ఎడ్లు తృతీయస్థానం సాధించాయి. జూనియర్ విభాగంలో సామర్లకోటకు చెందిన వల్లూరి సత్యదేవర ఎడ్లు ప్రథమస్థానం, విశాఖ జిల్లా నక్కపల్లికి చెందిన గుదే పావని ఎడ్లు ద్వితీయస్థానం, తిరుమాలికి చెందిన కానూరి రాంబాబు ఎడ్లు తృతీయ స్థానం సాధించాయి. సీనియర్ విభాగంలో ప్రథమవిజేతకు ఓలేటి చంటిబాబు రూ.10వేలు, ద్వితీయవిజేతకు చింతపల్లిసూర్యనారాయణ రూ.8వేలు, మాగాపు వీరబాబు, సేనాపతి రమణ రూ.6వేలు అందజేశారు. జూనియర్ విభాగంలో ప్రథమవిజేతకు సూతివీరకృష్ణప్రసాద్ రూ.8వేలు, ద్వితీయవిజేతకు కాకిలేటి రామకృష్ణ రూ.6వేలు, తృతీయ విజేతకు కోలా వీరబాబు రూ.4వేలు అందజేశారు. విజేతలకు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, డీసీసీబీ చైర్మ¯ŒS వరుపుల రాజా, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మ¯ŒS జ్యోతుల చంటిబాబు, జెడ్పీటీసీ జ్యోతుల పెదబాబు, పర్వత రాజబాబు నగదు, షీల్డులు అందజేశారు. నిర్వాహకులు పసల సూరిబాబు, ఓలేటి చంటిబాబు, సూతిబూరయ్య, చందువోలు నాగరాజు, సూతి వీరకృష్ణప్రసాద్ పాల్గొన్నారు.