మీ నిర్లక్ష్యంతో.. శాఖకు చెడ్డపేరు
మీ నిర్లక్ష్యంతో.. శాఖకు చెడ్డపేరు
Published Wed, Sep 7 2016 9:13 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
నిజామాబాద్ నాగారం : విద్యుత్‌శాఖలో అధికారులు నిర్లక్ష్యం వల్ల.. ఉద్యోగులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు... ఏ ఒక్కరు కూడా సక్రమంగా పనులు చేయడం లేదని... శాఖకు చెడ్డపేరు వస్తుందని... విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ప్రభాకర్ అలసత్వంపై టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ ఆగ్రహాం వ్యక్తం చేశారు. బుధవారం విద్యుత్‌శాఖ పవర్‌హౌజ్‌లో విద్యుత్‌అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎండీ మాట్లాడుతూ అధికారులు ఎవరు బాధ్యతయుతంగా విధులు నిర్వహించడం లేదన్నారు. స్థానికంగా హెడ్‌క్వాటర్స్‌లో ఉండమని చెప్పని ఎవ్వరు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ఎస్‌ఈ ప్రభాకర్ అలసత్వంగా వ్యవహారించడంపై సీఎండీ ఫైర్ అయ్యాడు. జిల్లా కలెక్షన్‌లో బాగా వెనుకబడిందన్నారు. పనులు చేయకుండా కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. తీసుకుంటున్న జీతాలను న్యాయం చేయకపోతే ఎలా ప్రశ్నించారు. స్టోర్‌లో కోట్లాది రూపాయలు విలువ చేసే పరికారాలు ఉన్నాయని, 40కేవీ ట్రాన్సుఫార్మర్‌లు 6నెలల నుంచి అలాగే ఉన్నాయన్నారు. చాలా ప్రాంతాల్లో 25కేవీ, 16కేవీ ట్రాన్సుఫార్మర్‌లు చెడిపోతున్నాయని అన్నారు. బడ్జెట్‌కు కోదువ లేదని, పనులు చేయకుండా కాలక్షేపం చేయడంపై మండిపడ్డారు. ఇక నుంచి సహించేది లేదని విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని సస్పెండ్ చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్‌లు నర్సింగ్‌రావు, వెంకటేశ్వర్‌రావు డీఈఈలు, ఏడీఈలు, ఏఈలు ఇతర అధికారులు తదితరులు పాల్గోన్నారు.
Advertisement