తీవ్ర జ్వరంతో మహిళ మృతి | woman died with high fever | Sakshi
Sakshi News home page

తీవ్ర జ్వరంతో మహిళ మృతి

Published Tue, Sep 20 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

woman died with high fever

డెంగీగా అనుమానం 
తాళ్లపూడి : మండలంలోని మలకపల్లికి చెందిన ఓ మహిళ తీవ్ర జ్వరంతో ప్రాణాలొదిలింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దూసనపూడి రామలక్ష్మి(29) కొద్ది రోజులుగా తీవ్ర జ్వరం బాధపడుతోంది. ఆమెను కుటుంబ సభ్యులు రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు డెంగీ లక్షణాలు కనిపిస్తున్నాయని, ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయని చెప్పారు. ఆమె అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. విషయం తెలుసుకున్న మలకపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారి కె.ప్రభాకరరెడ్డి, ఇతర సిబ్బంది మృతురాలి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. వైద్య పరీక్షల నివేదికలు అందుబాటులో లేవని తెలిపారు. ఆమె ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో మృతి చెంది ఉంటుందని ఆయన చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement