మహిళా ఉద్యోగుల సెలవులివిగో..! | woman holiday details | Sakshi
Sakshi News home page

మహిళా ఉద్యోగుల సెలవులివిగో..!

Published Wed, May 17 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM

woman holiday details

ధర్మవరం అర్బన్ : ప్రభుత్వశాఖలో పనిచేసే మహిళా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అనేక రకాలైన సెలవులు ఉన్నాయి. కానీ వాటి జీవోలు, ఎలాంటి వాటికి సెలవులు ఇస్తారో తెలియక చాలా మంది మహిళా ఉద్యోగులు వాటిని సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు. అనారోగ్య పరిస్థితుల్లోనూ విధులకు హాజరై ఇబ్బందులు పడుతుంటారు. మహిళా ఉద్యోగుల కోసం ఈ సమాచారం...

– జీఓలు                సెలవుల వివరాలు....
– జీఓ ఎంఎస్‌నెం.374     పురుషుల కంటే మహిళా టీచర్లకు 5 సీఎల్‌లు అధికం.
– జీఓ ఎంఎస్‌నెం.1415    ఫ్యామిలీ ప్లానింగ్‌ కోసం 14 రోజులు సెలవు ఇస్తారు.
– జీఓ ఎంఎస్‌నెం.124      మొదటి ఆపరేషన్‌ ఫెయిల్‌ అయితే రెండో ఆపరేషన్‌కు 14 రోజులు సెలవు ఇస్తారు.
– జీఓ ఎంఎస్‌నెం.128       లూప్‌ వేయించుకున్న రోజు స్పెషల్‌ సీఎల్‌ ఇస్తారు.
– జీఓ ఎంఎస్‌నెం.102      ఆపరేషన్‌ తరువాత పిల్లలు చనిపోతే రీకానలైజేషన్‌ చేయించుకున్న ఉద్యోగికి 21 రోజులు సెలవు ఇస్తారు.
– జీఓ ఎంఎస్‌నెం.52        గర్భసంచి తొలగిస్తే సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ సిఫార్స్‌ మేరకు 45 రోజుల ప్రత్యేక సెలవు ఇస్తారు.
– జీఓ ఎంఎస్‌నెం.152, 38       180 రోజుల ప్రసూతి సెలవు ఇస్తారు. ఇది ఇద్దరూ జీవించి ఉన్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.
– జీఓ ఎంఎస్‌నెం.463       సమ్మర్‌ హాలిడేస్‌లో ప్రసవించినా, ఇక్కడి నుంచి 180 రోజులు ఇస్తారు.
– జీఓ ఎంఎస్‌నెం.762       అబార్షన్‌కు 6 వారాల సెలవు ఇస్తారు.
– జీఓ ఎంఎస్‌నెం.39        వివాహానికి రూ.75 వేలు అప్పుగా ఇస్తారు. దీన్ని 70 వాయిదాల్లో 5.50 శాతం వడ్డీతో చెల్లించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement