భర్త వేధిస్తున్నాడని పిల్లల్ని బావిలో పడేసింది | Woman throws her children into well, commits suicide | Sakshi
Sakshi News home page

భర్త వేధిస్తున్నాడని పిల్లల్ని బావిలో పడేసింది

Published Sun, Apr 10 2016 3:47 PM | Last Updated on Sat, Aug 11 2018 8:12 PM

Woman throws her children into well, commits suicide

పీలేరు(చిత్తూరు జిల్లా): పీలేరు మండలం మేళ్లచెరువు పంచాయతీ మిథులానగరంలో ఓ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సునీత(30) అనే మహిళ తన పిల్లల్ని బావిలోకి తోసేసి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో యశ్విని(7), నవ్య(5) అనే ఇద్దరు చిన్నారులు కూడా మృతిచెందారు.

సునీత భర్త మునిశేఖర్ రోజూ తాగి భార్యను వేధిస్తుండటంతో ఈ ఘాతుకాతానికి పాల్పడింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. పీలేరు సీఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement