అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
Published Tue, Nov 29 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
రంపచోడవరం:
రంపచోడవరంలో వస్త్ర, కిరణా షాపులు నిర్వహిస్తూ రెండు రోజులుగా అదృశ్యమైన మంచెం వెంకటలక్ష్మి (32) మంగళవారం సాయంత్రం సీతపల్లి పాత రోడ్డులో బ్రిడ్జి దగ్గర కాలువలో విగతజీవిగా కనిపించింది. మైదాన ప్రాంతం రామచంద్రపురానికి చెందిన ఈమె పశ్చిమగోదావరి జిల్లా చర్ల గ్రామానికి చెందిన సత్తిబాబుతో కలిసి వ్యాపారం చేస్తూ సహజీవనం చేస్తున్నది. ఇటీవల వీరు గొడవపడి పోలీస్‌స్టేçÙ¯ŒSలో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. కేసు ఉండగానే ఇద్దరు ఒక నిర్ణయానికి కలిసి వ్యాపారం చేసేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే సత్తిబాబు ఆదివారం సాయంత్రం సీతపల్లి పాతరోడ్డులో కాలువలో దూకడంతో అక్కడ ఉన్న జాలర్లు, స్థానికులు రక్షించి 108లో రంపచోడరవం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసర వైద్యం కోసం కాకినాడ తరలించారు. సహజీవనం చేస్తున్న వ్యక్తితో వెంకటలక్ష్మి వెళ్లి కాలువలో దూకిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసులు నమోదు చేసినట్లు సీఐ గీతరామకృష్ణ తెలిపారు. సీఐ, ఎస్సై జె.విజయబాబు సంఘటన స్థ్ధలాన్ని పరిశీలించారు. కాగా కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన కిరణ్‌కుమార్‌ను వివాహం చేసుకున్న వెంకటలక్ష్మి భర్త నుంచి విడిపోయి ప్రస్తుతం సత్తిబాబుతో సహజీవనం చేస్తున్నది.
Advertisement
Advertisement