యాదగిరిగుట్ట : రోడ్డు ప్రమాదంలో యువతి మృతిచెందగా.. తండ్రికి తీవ్ర గాయాలైన సంఘటన పట్టణ పరిధిలో వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగాం జిల్లా కేంద్రానికి చెందిన అంజయ్య, ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురు అపర్ణ ద్విచక్రవాహనంపై జనగాం నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. వీరి బైక్‌ను హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో అపర్ణ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అంజయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి అపర్ణ (17)మృతి మృతిచెందింది. ఈ ఘటనపై ఎస్‌ఐ గోపాల్‌దాస్ ప్రభాకర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.