తుమ్మలపెంట ఇందిరమ్మ కాలనీలో ఓయువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా గురువారం వెలుగుచూసింది.
యువకుడి ఆత్మహత్య
Feb 3 2017 12:21 AM | Updated on Sep 5 2017 2:44 AM
- మూడు రోజుల తర్వాత వెలుగులోకి
- తుమ్మలపెంట ఇందిరమ్మ కాలనీలో ఘటన
కొలిమిగుండ్ల: తుమ్మలపెంట ఇందిరమ్మ కాలనీలో ఓయువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా గురువారం వెలుగుచూసింది. పత్తికొండకు చెందిన వడ్డె రంగయ్య, మద్దమ్మ దంపతులు ఉపాధి నిమిత్తం చిన్న కుమారుడు అరుణ్‌కుమార్(26)తో కలిసి పదేళ్ల క్రితమే ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. తండ్రి ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అరుణ్‌కుమార్ సమీపంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో కాంట్రాక్ట్ లేబర్‌గా పని చేస్తుండేవాడు. తల్లి కూలీ పనుల నిమిత్తం రెండు నెలల క్రితం పత్తికొండకు వెళ్లింది. అప్పటి నుంచి ఒక్కడే ఉంటున్న అరుణ్‌కుమార్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు.
మృతుడి ఇళ్లు కాలనీ చివర్లో ఉండటం..జన సంచారం లేని కారణంగా విషయం వెలుగు చూడలేదు. గురువారం హౌసింగ్ ఈఈ సుధాకరరెడ్డి, ఏఈ వాసుదేవరెడ్డి కాలనీలో పర్యటిస్తూ దుర్వాసన వస్తుండడంతో వెళ్లి చూడగా విషయం తెలిసింది. ఎస్‌ఐ బీటీ వెంకటసుబ్బయ్య సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. మూడు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రేమ వ్యవహరమే కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Advertisement
Advertisement