డౌనీహాల్లో యూత్‌ రిట్రీట్‌ | Youth retreat in Nellore downy hall | Sakshi
Sakshi News home page

డౌనీహాల్లో యూత్‌ రిట్రీట్‌

Published Tue, Oct 11 2016 2:04 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

డౌనీహాల్లో యూత్‌ రిట్రీట్‌ - Sakshi

డౌనీహాల్లో యూత్‌ రిట్రీట్‌

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వీఆర్సీ సెంటర్‌ వద్ద ఉన్న బాప్టిస్ట్‌ చర్చ్‌ డౌనీహాల్లో సంఘ వార్షిక ఒక రోజు యూత్‌ రిట్రీట్‌ను సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని వివిధ చర్చిలకు చెందిన యూత్‌ పాల్గొన్న ఈ కార్యక్రమానికి అతిథిగా అంతర్జాతీయ ప్రసంగీకుడు రెవరెండ్‌ అగస్టీన్‌ హాజరయ్యారు. ప్రముఖ ఆధ్యాత్మిక గాయకుడు జోనా శామ్యూల్‌ తన బృందంతో వివిధ భక్తి గీతాలను అలపించారు. యూత్‌ డైరెక్టర్లు హేమలత విద్యాధర్, విజయ్‌పాల్‌ ఆధ్వర్యంలో క్విజ్, పాటల పోటీలను నిర్వహించారు. పాస్టర్‌ రెవరెండ్‌ అనిల్‌కుమార్, సంఘ చైర్మన్‌ జాన్, ఫుల్‌ పిట్‌ కమిటీ చైర్మన్‌ డేవిడ్‌లివింగ్‌స్టన్, కార్యదర్శి గుర్రం అరుణ్‌కుమార్,  ట్రెజరర్‌ విజయ్‌భాస్కర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement