ఉత్సాహంగా కృతజ్ఞతార్పణల పండగ
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నగరంలోని బాప్టిస్ట్ చర్చి డౌనీహాల్లో శనివారం జరిగిన వార్షిక కృతజ్ఞతార్పణల పండగలో సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తినుబండారాల స్టాళ్లు పలువుర్ని ఆకట్టుకున్నాయి. ఈ స్టాళ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని కానుకలుగా ఇవ్వడం సభ్యులకు ఆనవాయతీ. వివిధ ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పాస్టర్ రెవ. అనిల్‌కుమార్ వాక్యోపదేశాన్ని అందించారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఆదివారం ఉదయం 9.30కు జరిగే కృతజ్ఞతార్పణల పండగ ముగింపు ఆరాధనలో రక్షణ టీవీ వాక్యోపదేశకుడు బ్రదర్ ప్రకాష్ గంటెల దేవవార్తమానాన్ని అందిస్తారని సంఘ కార్యదర్శి గుర్రం అరుణ్‌కుమార్ తెలిపారు. చైర్మన్ ఎన్‌వై జాన్, పుల్‌పిట్ కమిటీ చైర్మన్ డేవిడ్ లివింగ్‌స్టన్, కోశాధికారి విజయభాస్కర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.