
చిన్నారావు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన బూరుగుపల్లి చిన్నారావు కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లిన ఆయన.. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో చిన్నారావు కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లారు.
చిన్నారావు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితులు. చిన్నారావు ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. ఇవాళ చిన్నారావు కుటుంబసభ్యులను ప్రత్యక్షంగా వెళ్లి పరామర్శించారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి బుట్టాయగూడెం చేరుకుంటారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు ఇంట్లో వైఎస్ జగన్ రాత్రికి బస చేస్తారు.