అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో ఆరో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా కొడిమిలో చేనేత కార్మికుడు రామాంజనేయులు, నరసనాయనకుంటలో రైతు లక్ష్మానాయక్ కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. నారాయణపురం, తపోవనం, రాచానపల్లి, సిండికేట్నగర్ మీదుగా వైఎస్ జగన్ పర్యటన సాగింది.
మామిళ్లపల్లిలో వైఎస్ జగన్కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ జగన్ పూలమాల వేశారు. కోనాపురం చేరుకుని రైతు నరేంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కనగానపల్లెలో కరుణాకర్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. తగరకుంటలో వైఎస్ జగన్కు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. పాతపాలెంలో రైతు సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. రైతు భరోసా యాత్రకు ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, పార్టీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి, శంకర్ నారాయణలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథ్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
నాలుగు కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
Published Mon, Jan 11 2016 7:55 PM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement