sixth day
-
ఆరో రోజూ లాభాలే..!
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడికి లోనైన సూచీలు శుక్రవారం లాభాల్లోనే ముగిశాయి. చివరి అరగంటలో నెలకొన్న కొనుగోళ్లు సూచీలను నష్టాల నుంచి గట్టెక్కించాయి. సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో 46,961 వద్ద ముగిసింది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 13,761 వద్ద స్థిరపడింది. సూచీలకిది వరుసగా ఆరురోజూ లాభాల ముగింపు. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగ షేర్లు లాభపడ్డాయి. బ్యాంకింగ్, మెటల్, ఆర్థిక, ఆటో, రియల్టీ రంగ షేర్లు నష్టపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 396 పాయింట్ల రేంజ్ లో కదలాడింది. నిఫ్టీ 114 పాయింట్ల్ల మధ్య ఊగిసలాడింది. నగదు విభాగంలో ఎఫ్ఐఐలు రూ.2,720 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఫండ్స్(డీఐఐ) రూ.2,424 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. ఇక ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 862 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్లను ఆర్జించాయి. సూచీలకు ఇది ఏడోవారమూ లాభాల ముగింపు కావడం విశేషం. స్టాక్ మార్కెట్లోకి నిర్విరామంగా కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు సూచీలను నడిపిస్తున్నాయని రిలయన్స్ సెక్యూరిటీస్ హెడ్ బినోద్ మోదీ తెలిపారు. కోవిడ్–19 వ్యాక్సిన్ అభివృద్ధి వార్తలు, బ్రెగ్జిట్ పురోగతి, అమెరిక ఉద్దీపన ఆశలు, ఆర్థిక వ్యవస్థ రికవరీ సంకేతాలతో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎఫ్ఐఐలు ఆసక్తి చూపుతున్నారని బినోద్ పేర్కొన్నారు. ఇంట్రాడేలో 47,000 స్థాయికి సెన్సెక్స్... ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ తొలిసారిగా 47,000 పైన, నిఫ్టీ 13,750 పైన ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే ఉదయం సెషన్లో అనూహ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. సెన్సెక్స్ ఒక దశలో 260 పాయింట్లు నిఫ్టీ 82 పాయింట్లను కోల్పోయాయి. ఆదుకున్న ఐటీ షేర్లు... ఐటీ సేవల దిగ్గజం యాక్సెంచర్ నవంబర్‌తో ముగిసిన క్వార్టర్లో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. దీంతో దేశీయ లిస్టెడ్ ఐటీ కంపెనీ షేర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈ ఐటీ ఇండెక్స్ ఇంట్రాడేలో 2% ఎగసి 23,408 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. -
ఆరో రోజుకు హజారే దీక్ష
రాలెగావ్ సిద్ధి (మహారాష్ట్ర): లోక్‌పాల్, లోకాయుక్తాల నియామకాలు చేపట్టాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన దీక్ష సోమవారం ఆరో రోజుకు చేరింది. దీక్ష కారణంగా అన్నాహజారే 4.25 కేజీల బరువు తగ్గారని, బీపీ పెరిగిందని డాక్టర్ ధనంజయ్ పొటే తెలిపారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అన్నా హజారే ప్రాణాలను కాపాడాలని శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్ఎన్ఎస్) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఎమ్ఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే,, సామాజిక కార్యకర్త రాజేంద్ర సింగ్ సోమవారం హజారేను కలిశారు. ‘హజారే 2013లో చేసిన దీక్ష కారణంగానే బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చింది. హజారే వల్లే కేజ్రీవాల్ ఎవరో దేశానికి తెలిసింది. అలాంటి వ్యక్తి కనీసం ధర్నాకు మద్దతు తెలియజేయలేదు’ అని ఠాక్రే అన్నారు. -
ఆరో రోజు వైవీ సుబ్బారెడ్డి ప్రజా పాదయాత్ర
-
ఆరో రోజు కొనసాగుతున్న వైఎస్ జగన్ పాదయాత్ర
-
ఆరో రోజు 22,840 క్వింటాళ్ల విత్తన పంపిణీ
అనంతపురం అగ్రికల్చర్ : విత్తన వేరుశనగ పంపిణీలో ఆరో రోజు మంగళవారం 63 మండలాల పరిధిలో 19,695 మంది రైతులకు 22,840 క్వింటాళ్లు పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం మీద ఇప్పటివరకు 85,552 మంది రైతులకు 99,339 క్వింటాళ్లు అందజేశామని పేర్కొన్నారు. కమ్యూనిటీ మేనేజ్మెంట్ సీడ్ సిస్టం (సీఎంఎస్ఎస్) కింద మన విత్తన కేంద్రాల (ఎంవీకే) ద్వారా కూడా ఎంపిక చేసిన ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. -
ఆరో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు కూడా నష్టాలతోనే ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతల నేపథ్యంలో లాభాలతో మొదలైనా మార్కెట్లు చివర్లో అమ్మకాల ఒత్తిడితో నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 66 పాయింట్లు క్షీణించి 26,242 వద్ద , నిఫ్టీ 21 పాయింట్లు తగ్గి 8,061 వద్ద ముగిశాయి. ఇది నెల రోజుల కనిష్టం. నిఫ్టీ 8100 కు మరింత దిగువన ముగిసినా 8050 స్థాయిని పైన ప్రస్తుతానికి స్థిరపడింది. రియల్టీ, మెటల్ సెక్టార్లు తప్ప దాదాపు అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా, మీడియా రంగాలు నీరసించాయి. ఇన్ఫ్రాటెల్, సన్ ఫార్మా, ఐటీసీ, ఐడియా, అంబుజా సిమెంట్, జీ, హెచ్‌సీఎల్ టెక్, హీరో మోటో, యాక్సిస్ బ్యాంక్, అరబిందో భారీ పతనాన్ని నమోదు చేయగా, అల్ట్రాటెక్, లుపిన్, ఎన్టీపీసీ, మారుతీ, ఇండస్ఇండ్, హిందాల్కో, ఓఎన్జీసీ, బీవోబీ, ఐషర్, పవర్‌గ్రిడ్ స్వల్పంగా లాభపడ్డాయి. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి ఈరోజు బలపడింది. 13 పైసలు లాభపడి రూ.67.91వద్ద ఉంది. పసిడికూడా ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అవుతోంది.రూ.115 క్షీణించిన పుత్తడి పది గ్రా.రూ.27,115గా ఉంది. -
ఆరో రోజు పుష్కర శోభ
-
ఆరో రోజు కృష్ణమ్మ పుష్కర శోభ
-
నాలుగు కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో ఆరో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా కొడిమిలో చేనేత కార్మికుడు రామాంజనేయులు, నరసనాయనకుంటలో రైతు లక్ష్మానాయక్ కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. నారాయణపురం, తపోవనం, రాచానపల్లి, సిండికేట్‌నగర్ మీదుగా వైఎస్ జగన్ పర్యటన సాగింది. మామిళ్లపల్లిలో వైఎస్ జగన్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ జగన్ పూలమాల వేశారు. కోనాపురం చేరుకుని రైతు నరేంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కనగానపల్లెలో కరుణాకర్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. తగరకుంటలో వైఎస్ జగన్‌కు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. పాతపాలెంలో రైతు సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. రైతు భరోసా యాత్రకు ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, పార్టీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి, శంకర్ నారాయణలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథ్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
6వ కొనసాగుతున్న సమ్మె